Skip to main content

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా జస్టిస్ నాగార్జునరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌గా హైకోర్డు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్ పదవీ కాలం అక్టోబర్ 29వ తేదీ వరకు ఉంది. ఈ నేపథ్యంలో జస్టిస్ నాగార్జునరెడ్డి నియామకం అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వస్తుంది.

హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో సంచలన తీర్పులు వెలువరించిన జస్టిస్ నాగార్జునరెడ్డి 1956 డిసెంబర్ 5న వైఎస్సార్ జిల్లా, గడికోట గ్రామంలో జన్మించారు. 1979లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 1989-1996 వరకు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. తరువాత బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఏపీ హైకోర్టు, ఓఎన్‌జీసీ తదితర సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారు. 2006 సెప్టెంబర్ 11న ఏపీ ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2018 డిసెంబర్ 4న పదవీ విరమణ చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి
Published date : 17 Sep 2019 05:29PM

Photo Stories