ఏపీఎస్‌ఎస్‌డీసీకి అసోచామ్ జాతీయ అవార్డు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏిపీఎస్‌ఎస్‌డీసీ)కు అసోచామ్ జాతీయ అవార్డు లభించింది.
న్యూఢిల్లీలో నవంబర్ 27న జరిగిన ‘స్కిల్ ఇండియా సమ్మిట్ అండ్ అవార్డ్స్’ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ చేతులమీదుగా ఏిపీఎస్‌ఎస్‌డీసీ సీజీఎం డాక్టర్ రవికుమార్ ఈ అవార్డును అందుకొన్నారు. ఉత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచి ఈ అవార్డును దక్కించుకుంది. మరోవైపు భారీ స్థాయిలో నైపుణ్య శిక్షణ ఇస్తున్న విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ ప్రభుత్వరంగ సంస్థల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది.
నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు శిక్షణలో ఉత్తమ విధానాలు అవలంబిస్తున్న రాష్ట్రాలకు అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సంస్థ ఏటా అవార్డులు అందజేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అసోచామ్ జాతీయ అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ
ఎందుకు : ఉత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచినందుకు

Published date : 28 Nov 2019 05:52PM