ఏపీఆర్ఏసీఏ చైర్మన్‌గా నియమితులైన తెలుగు వ్యక్తి?
ఆసియా–పసిఫిక్ రూరల్ అగ్రికల్చర్ క్రెడిట్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఏసీఏ) చైర్మన్‌గా నాబార్డు చైర్మన్ డాక్టర్ చింతల గోవింద రాజులు నియమితులయ్యారు. మార్చి 5న ఢిల్లీలో వర్చువల్ విధానం ద్వారా జరిగిన 73వ ఎక్స్కామ్, 22వ ఏపీఆర్ఏసీఏ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఏపీఆర్‌ఏసీఏ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఈ పదవిని అధిరోహించిన తొలి తెలుగువాడిగా, రెండో భారతీయుడిగా డాక్టర్ చింతల గుర్తింపు పొందారు. రెండేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారు.
బ్యాంకాక్ ప్రధాన కేంద్రంగా...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తరహాలోనే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులతోపాటు పలు ఏజెన్సీలు ఏపీఆర్‌ఏసీఏ పరిధిలో ఉన్నాయి. 1977లో ఏర్పడిన ఏపీఆర్ఏసీఏ.. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ప్రపంచంలోని ఐదు ఆర్‌ఏసీఏల్లో ఇదే అతిపెద్దది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా–పసిఫిక్ రూరల్ అగ్రికల్చర్ క్రెడిట్ అసోసియేషన్ (ఏపీఆర్‌ఏసీఏ) చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : నాబార్డు చైర్మన్ డాక్టర్ చింతల గోవింద రాజులు