ఏపీ విద్యా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య నియమితులు కానున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 12న నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల నియంత్రణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి ఈ కమిషన్‌కు సీఈవోగా వ్యవహరిస్తారు. ఈ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారులు ఉంటాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య
Published date : 13 Sep 2019 06:02PM