Skip to main content

ఏపీ విద్యా చట్టం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ఉద్దేశించిన ‘ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 1/1982(సవరణ) బిలును రాష్ట్ర అసెంబ్లీ జనవరి 23న రెండోసారి ఆమోదించింది.
Current Affairsగత సమావేశాల్లో తెచ్చిన ఈ బిల్లుపై చర్చించాక అసెంబ్లీ ఆమోదించి శాసనమండలికి పంపింది. అయితే మండలి దీన్ని ఆమోదించకుండా పలు సవరణలు సూచించింది. మండలి సవరణలను తిరస్కరించినట్టు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం-1982 సవరణ
ఉద్దేశం:
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు భోదన.. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం.. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదం చేయడం.. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం-1982 సవరణకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఎందుకు : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు
Published date : 24 Jan 2020 05:39PM

Photo Stories