Skip to main content

ఏపీ తీరంలో భారత్, అమెరికా సైనిక విన్యాసాలు

భారత్, అమెరికా త్రివిధ దళాలు ‘టైగర్ ట్రయాంఫ్’ (పులి విజయం) పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, కాకినాడ సముద్రతీరంలో సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి.
2019, నవంబర్ 14 నుంచి 8 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాల్లో 500 మంది అమెరికన్ మెరైన్స్, సెయిలర్స్, ఎయిర్‌మెన్, భారత దేశపు త్రివిధ దళాలకు చెందిన 1,200 మంది పాల్గొనున్నారు. భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్ జలష్వా, ఐఎన్‌ఎస్ ఐరావత్‌తో పాటు అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్ జర్మన్ టౌన్ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో ఆకర్షణగా నిలవనున్నాయి.

భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు మెరుగుపడటంతో పాటు భద్రత, పరస్పర సహకారం, విపత్తుల వేళ పరస్పర తోడ్పాటు వంటి అంశాలను బలోపేతం చేసుకోవడమే ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నవంబర్ 14 నుంచి ‘టైగర్ ట్రయాంఫ్’ (పులి విజయం) పేరుతో సైనిక విన్యాసాలు
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : భారత్, అమెరికా త్రివిధ దళాలు
ఎక్కడ : విశాఖ, కాకినాడ సముద్రతీరం, ఆంధ్రప్రదేశ్

మాదిరి ప్రశ్నలు
1. ‘టైగర్ ట్రయాంఫ్’ (పులి విజయం) పేరుతో ఏ రెండు దేశాలు కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి.
1. భారత్, అమెరికా
2. భారత్, చైనా
3. భారత్, జపాన్
4. చైనా, అమెరికా
సమాధానం : 1

2. ‘టైగర్ ట్రయాంఫ్’ (పులి విజయం) పేరుతో నిర్వహించనున్న సైనిక విన్యాసాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి?
1. 2019, నవంబర్ 15
2. 2019, డిసెంబర్ 14
3. 2019, నవంబర్ 14
4. 2020, నవంబర్ 14
సమాధానం : 3
Published date : 08 Nov 2019 05:51PM

Photo Stories