Skip to main content

ఏపీ టెండర్ల కమిటీ చైర్మన్‌గా జస్టిస్ శివశంకరరావు

ఆంధ్రప్రదేశ్ టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు సెప్టెంబర్ 14న బాధ్యతలు స్వీకరించారు.
మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీ టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : హెకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. శివశంకరరావు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
Published date : 14 Sep 2019 05:42PM

Photo Stories