ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు.
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సెప్టెంబర్ 23న జరిగిన ఈ భేటీలో గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి, అలైన్‌మెంట్ ఎలా ఉండాలి అనే విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్‌లోకి గోదావరి జలాలను తరలించి అక్కడి నుంచి రివర్సబుల్ టర్బైన్స్ ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని తరలించే అంశంపై చర్చలు జరిపారు.
2019, సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ నెల 8 వరకు జరగనున్న తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సావాలకు విచ్చేయాలని సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. తెలంగాణలో 18 వేల మంది పోలీసులను ఒకేసారి నియమిస్తున్నందున వారిలో 4 వేల మందికి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ ఇవ్వాలని జగన్‌ను కేసీఆర్ కోరారు. ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : ప్రగతి భవ న్, హైదరాబాద్
ఎందుకు : గోదావరి నీటిని కృష్ణాకు తరిలించే విషయమై చర్చించేందుకు

Published date : 24 Sep 2019 05:39PM