Skip to main content

ఏపీ సీఎంతో ప్రపంచ బ్యాంకు బృందం భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో దక్షిణాసియా మానవ వనరుల విభాగం రీజినల్ డెరైక్టర్ షెర్ బర్న్ బెంజ్ నేతృత్వంలోని ప్రపంచ బ్యాంకు బృందం భేటీ అయ్యింది.
Current Affairsరాష్ట్ర సచివాలయంలో ఫిబ్రవరి 25న జరిగిన ఈ సమావేశంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపించింది. ఈ అంశాల్లో తగిన విధంగా సహాయం అందిస్తామని తెలిపింది. నాలుగు నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేసి, ఇతరత్రా ఏయే కార్యక్రమాలకు సహాయం అందించాలన్నదానిపై ఒక అవగాహనకు వస్తామని వెల్లడించింది. ఈ సందర్భంగా బ్యాంకు బృందానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను సీఎం సమగ్రంగా వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం
ఎక్కడ : ఏపీ సచివాలయం
ఎందుకు : విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందించే విషయమై చర్చించేందుకు
Published date : 26 Feb 2020 05:56PM

Photo Stories