ఏపీ సీఎంతో అమెరికన్ కాన్సులేట్ జనరల్ భేటీ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్ భేటీ అయ్యారు.
అమరావతిలో అక్టోబర్ 16న జరిగిన ఈ సమావేశంలో గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషి చేయాలని సీఎం విజ్ఞప్తిచేశారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తోనూ రిఫ్‌మాన్ సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్‌మాన్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
Published date : 17 Oct 2019 05:44PM