Skip to main content

ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన మే 23న తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు పంపించారు. దీన్ని గవర్నర్ నరసింహన్ వెంటనే ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని చంద్రబాబును నరసింహన్ కోరారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
ఎప్పుడు: మే 23
ఎవరు: చంద్రబాబు నాయుడు
ఎందుకు: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనందుకు
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
Published date : 24 May 2019 06:28PM

Photo Stories