Skip to main content

ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం

ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా డాక్టర్ పి.లక్ష్మీనరసింహం జూన్ 6న విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రభుత్వం సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధర్‌ను బదిలీ చేసి ఆ స్థానంలో లక్ష్మీనరసింహంను నియమించింది. మరోవైపు ఏపీ ట్రాన్స్ కో సీఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్ కూడా జూన్ 6న బాధ్యతలు చేపట్టారు. అలాగే ఏపీ జెన్‌కో ఎండీగా శ్రీధర్ జూన్ 7న బాధ్యతలు స్వీకరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : డాక్టర్ పి.లక్ష్మీనరసింహం
ఎక్కడ : సీఆర్‌డీఏ కార్యాలయం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 07 Jun 2019 05:40PM

Photo Stories