ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా గౌతమ్ సవాంగ్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇకపై అన్ని పోలీసు బలగాలకు బాస్‌గా వ్యవహరిస్తారు. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సవాంగ్ జూన్ 1న ఆర్.పి.ఠాకూర్ స్థానంలో ఏపీ డీజీపీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను వైఎస్ జగన్ సర్కారు కేంద్ర హోంశాఖ పరిధిలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)కు పంపించింది. ఆగస్టు 1వ తేదీన సమావేశమైన యూపీఎస్‌సీ ఎంప్యానల్ కమిటీ.. ఏపీ డీజీపీ నియామకంపై చేసిన సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం సవాంగ్‌ను పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : గౌతమ్ సవాంగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : గౌతమ్ సవాంగ్
Published date : 14 Aug 2019 06:59PM