Skip to main content

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదీని నియమిస్తూ జనవరి 17న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి రామ్ ప్రకాష్ సిసోడియాను బదిలీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణ కేంద్ర ప్రభుత్వంలో 2018 వరకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా, సాధారణ పరిపాలన(సర్వీసెస్) శాఖ ముఖ్య కార్యదర్శి (ఇన్‌చార్జి)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నియామకం
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : గోపాలకృష్ణ ద్వివేదీ
Published date : 18 Jan 2019 06:30PM

Photo Stories