ఏపీ పోలీస్ తొలి డ్యూటీ మీట్ ఏ నగరంలో జరిగింది?
తిరుపతి ఎమ్మార్ పల్లి ఏఆర్ గ్రౌండ్‌లో జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో జనవరి 4న ప్రారంభించారు. ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో జరిగిన ఈ మీట్‌లో 13 జిల్లాల నుంచి 200 మంది పోలీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
డ్యూటీ మీట్‌లో భాగంగా... క్రీడలు, ప్రతిభా పాటవాల ప్రదర్శనలతో పాటు ప్రత్యేకంగా సాంకేతికత, నేరాల తీరు, దర్యాప్తు తదితర నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా సింపోజియంలు ఏర్పాటు చేశారు. సైబర్ సేఫ్టీ, మహిళల రక్షణ వంటి అనేక కీలక విషయాలను తెలుసుకోవడానికి డ్యూటీ మీట్ వేదికైంది. మహిళా భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ నిర్వహణ
ఎప్పుడు : జనవరి 4 నుంచి 7వ తేదీ వరకు
ఎవరు : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా
ఎందుకు : సైబర్ సేఫ్టీ, మహిళల రక్షణ వంటి అనేక కీలక విషయాలను పోలీసులు తెలుసుకోవడానికి