ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం తన మంత్రివర్గ తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
జూన్ 10న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు...
మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు...
- కంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దు
- ఉద్యోగులందరికీ 27శాతం మధ్యంతర భృతికి ఆమోదం
- అంగన్‌వాడీలు, ఆయాలు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు
- బిడ్డలను బడికి పంపే తల్లులకు ఏడాదికోసారి రూ.15వేలు అందించే ‘అమ్మ ఒడి’ని జనవరి 26నుంచి అమలుకు నిర్ణయం
- రెతు యూనిట్‌గా ఏడాదికి రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే ప్రతిపాదన కు ఆమోదం
- 2014 నుంచి చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ రూ.2వేల కోట్లు తక్షణమే విడుదల
- ముఖ్యమంత్రి నేతృత్వంలో రైతు కమిషన్ ఏర్పాటు
- రైతులకు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందజేత
- అగ్రిగోల్డు బాధితులకు చెల్లించేందుకు రూ.1150 కోట్లను న్యాయస్థానంలో జమకు నిర్ణయం
- ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తింపు
- వైఎస్‌ఆర్ పేరిట నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం
- ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానాన్ని నిలిపివే త
- విద్యుత్ ఒప్పందాల పున:సమీక్షించకు ఆమోదం
- రూ.3వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి
- ఒక్కో రైతుకు 5 జీవాలు, 5 పశువులకు ఉచిత బీమా
- పంటరుణాలకు వైఎస్‌ఆర్ వడ్డీలేని రుణాల పథకం
- రైతులకు ఉచిత బోర్ల తవ్వకం కోసం 200 రిగ్‌ల కొనుగోలు
- రైతు బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం
- గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థల్లో రిసోర్సుపర్సను, యానిమేటర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం
- అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.10,500 నుంచి రూ.11,500కు, అంగన్‌వాడీ ఆయాల వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంపు
- హోంగార్డులకు తెలంగాణలో చెల్లిస్తున్న వేతనం కంటే రూ.వెయి్య ఎక్కువ ఇవ్వాలని నిర్ణయం
- అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.18 వేల వేతనం ఇచ్చే అంశంపై ఆయా శాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు
- ఆశావర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
- ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు పేద, మధ్య తరగతి వారికి తప్పనిసరి
- దశలవారీగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి మంత్రివర్గ ఉపసంఘం
- వైఎస్‌ఆర్ పేరిట నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం
- ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీ
- సరిగ్గా లేని 108, 104 వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాలని నిర్ణయం
- గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్నిరకాల నామినేటెడ్ కమిటీలను రద్దు.
Published date : 11 Jun 2019 06:56PM