Skip to main content

ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ లోగో ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ జడ్జి జ్యుడీషియల్ ప్రివ్యూ అధికారిక లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 7న తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
దీనితో పాటు ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్‌సైట్ judicialpreview.ap.gov.in ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్జి జ్యుడిషియల్ ప్రివ్యూ డాక్టర్ బి.శివశంకరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం 2019, ఆగస్టు 14 నుంచి అమలులోకి వచ్చిన విషయం విదితమే. ఈ చట్టం ప్రకారం వివిధ శాఖల్లో రూ.100 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన పనుల వివరాలను ముందు న్యాయ పరిశీలనకు పంపుతారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ లోగో ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తాడేపల్లి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
Published date : 09 Oct 2019 06:01PM

Photo Stories