Skip to main content

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రాజేంద్రనాథ్‌రెడ్డి

ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు.
Current Affairs
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు పోలీసు అధికారులను బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ విభాగాధికారిగా ఉన్న రాజేంద్రనాథరెడ్డిని నిఘా విభాగానికి బదిలీ చేశారు. విజిలెన్స్ విభాగానికి కూడా ఆయనే ఇన్చార్జ్‌గా ఉంటారు. విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న రాజీవ్‌ కుమార్‌ మీనాను మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మనీష్ కుమార్‌ సిన్హాను విశాఖపట్నం సిటీ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.

10 రాష్ట్రాల్లో కట్టడి అవసరం: మోదీ
కలసికట్టుగా కరోనాపై పోరాటం చేద్దామని ప్రధాని మోదీ ముఖ్యమంత్రులకు పిలుపు నిచ్చారు. కోవిడ్‌ కేసులు అత్యధికంగా ఉన్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఆగస్టు 11న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో సమీక్షిం చారు. మొత్తం కేసుల్లో 80 శాతంపైగా నమోదవుతున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు కరోనాని కట్టడి చేస్తే, భారత్‌ ఈ మహమ్మా రిపై విజయం సాధిస్తుందని అన్నారు.

‌క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి
Published date : 12 Aug 2020 05:57PM

Photo Stories