ఏపీ హెచ్చార్సీ చైర్మన్‌గా ఎంపికైన రిటైర్డ్ న్యాయమూర్తి?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్చార్సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఎంపికయ్యారు.
అలాగే కమిషన్ సభ్యులుగా రిటైర్డ్ జిల్లా జడ్జి దండే సుబ్రహ్మణ్యం (జ్యుడిషియల్), న్యాయవాది డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు (నాన్ జ్యుడిషియల్) ఎంపికయ్యారు. మార్చి 17న సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన... సమావేశమైన ఎంపిక కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఎంపిక కమిటీలో శాసనమండలి చైర్మన్ షరీఫ్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, హోం మంత్రి మేకతోటి సుచరిత సభ్యులుగా ఉన్నారు. ఎంపిక చేసిన వారి పేర్లను తదుపరి ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్చార్సీ) చైర్మన్‌గా ఎంపిక
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి
Published date : 18 Mar 2021 05:55PM