Skip to main content

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య ప్రమాణం చేశారు.
Current Affairsహైకోర్టు మొదటి కోర్టు హాలులో జనవరి 13న జరిగిన కార్యక్రమంలో వీరిచే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి వేర్వేరుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. ఈ నలుగురి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరింది. వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : రావు రఘునందన్‌రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య

మాదిరి ప్రశ్నలు
Published date : 14 Jan 2020 04:14PM

Photo Stories