Skip to main content

ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు

వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairsఇందుకోసం ‘ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్’ పేరుతో ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీకి రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, మైనింగ్ శాఖ కార్యదర్శి కె.రాంగోపాల్‌లను డెరైక్టర్లుగా నియమిస్తూ డిసెంబర్ 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీ మూలధనం, డీపీఆర్ నివేదిక కోసం.. రూ.62 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేట్ కార్యాలయాన్ని విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసింది.

కడప స్టీల్‌ప్లాంట్ కోసం 2019-20 బడ్జెట్‌లో రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసేలా ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకుంది. ప్లాంట్ ఏర్పాటుకు 3,295 ఎకరాలను సేకరించింది. ఈ కర్మాగారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019, డిసెంబర్ 23 లేదా 24వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం
Published date : 05 Dec 2019 05:46PM

Photo Stories