Skip to main content

ఏపీ ఏసీబీ డీజీగా శంఖబ్రత బాగ్చీ

ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డెరైక్టర్ జనరల్‌గా శంఖబ్రత బాగ్చీకి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఏప్రిల్ 4న ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటివరకూ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న డీజీపీ ఆర్.పి.ఠాకూర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రస్తుతం ఏసీబీ డెరైక్టర్‌గా బాగ్చీ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి ఎన్నికల సంఘం తప్పించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ ఏసీబీ డెరైక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : శంఖబ్రత బాగ్చీ
Published date : 05 Apr 2019 06:37PM

Photo Stories