ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మాజీ సీఎస్?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ పొందిన నీలం సాహ్ని రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్‌గా ఖరారయ్యారు.
ఈ మేరకు ఆమె నియామకానికి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మార్చి 26న ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం ఆ బాధ్యతలో పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే.
ఇదే తొలిసారి...
1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన నీలం సాహ్ని 2019 నవంబర్ 15 నుంచి 2020 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పని చేశారు. ప్రస్తుతం క్యాబినెట్ హోదాలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. అయితే ఎస్‌ఈసీ పదవి చేపట్టే నాటికి ఆమె ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఓ మహిళ నియమితులవ్వడం ఇదే తొలిసారి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మాజీ సీఎస్?
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : నీలం సాహ్ని
ఎందుకు : ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగియనుండటంతో

Published date : 29 Mar 2021 12:50PM