Skip to main content

ఏపీ దిశ చట్టం స్పెషల్ ఆఫీసర్లుగా శుక్లా, దీపిక

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం-2019 అమలు కోసం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జనవరి 2న ఉత్తర్వులు జారీ చేశారు.
Current Affairsఐఏఎస్ విభాగంలో ప్రస్తుతం మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరక్టరుగా ఉన్న కృతికా శుక్లాను దిశ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. అలాగే ఐపీఎస్ విభాగంలో కర్నూలు ఏఎస్‌పీగా ఉన్న ఎం.దీపికను గుంటూరు సీఐడీ విభాగంలో ఏడీజీగా బదిలీ చేసి దిశ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు.

అమలుకు రూ.87 కోట్లు కేటాయింపు
దిశ చట్టం అమలు కోసం రూ.87 కోట్లు కేటాయిస్తూ జనవరి 1న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలు, బాలలపై జరిగే క్రూరమైన లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు, మహిళా పోలీసుస్టేషన్ల ఉన్నతీకరణ, ఫోరెన్సిక్ ప్రయోగశాలల బలోపేతం, దిశ కాల్‌సెంటర్, దిశ యాప్‌ల కోసం ఈ నిధులు మంజూరు చేసింది. అందులో రూ.23.52 కోట్లతో మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాల, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న ప్రాంతీయ ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్‌ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీ దిశ చట్టం-2019 స్పెషల్ ఆఫీసర్లుగా నియామకం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : కృతికా శుక్లా, ఎం.దీపిక
ఎందుకు : దిశ చట్టం అమలు కోసం

మాదిరి ప్రశ్నలు

Published date : 03 Jan 2020 05:44PM

Photo Stories