Skip to main content

ఏపీ దిశ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం

మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే వారికి మరణ శాసనం లిఖించేలా, 21 పనిదినాల్లోనే తీర్పు ఇచ్చేలా రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-క్రిమినల్ లా (సవరణ) బిల్లు-2019’ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 13న ఆమోదించింది.
Edu newsఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ లా చట్టం- 1973ను రాష్ట్రానికి వర్తింపచేయడంతో పాటు, అందులో అవసరమైన సవరణల చేస్తూ ఈ బిల్లును రూపొందించారు. అలాగే పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా.. సోషల్‌మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా మహిళల్ని వేధించడం, అసభ్య పోస్టింగులు పెడితే రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా ఈ చట్టంలో కొత్త సెక్షన్లను చేర్చారు.
 
 ప్రత్యేక న్యాయస్థానాల బిల్లుకు ఆమోదం
 మహిళలు, బాలలపై నేరాల్ని త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటునకు వీలు కల్పించే ‘ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- మహిళలు, బాలలపై నిర్ధేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019’కు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు.. త్వరితగతిన విచారణ ప్రక్రియ ముగించేందుకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తారు. ఇంతవరకూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు లేవు.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-క్రిమినల్ లా (సవరణ) బిల్లు-2019కు ఆమోదం
 ఎప్పుడు  : డిసెంబర్ 13
 ఎవరు  : ఆంధ్రప్రదేశ్ శాసనసభ
 ఎందుకు : మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే వారికి మరణ శాసనం లిఖించేలా, 21 పనిదినాల్లోనే తీర్పు ఇచ్చేలా
Published date : 14 Dec 2019 05:15PM

Photo Stories