Skip to main content

ఎన్‌సీఎల్‌టీ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి?

న్యూఢిల్లీలో ఉన్ననేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) తాత్కాలిక అధ్యక్షుడిగా అమరావతి బెంచ్‌ జ్యుడీషియల్‌ సభ్యుడు జస్టిస్‌ భాస్కర పంతుల మోహన్‌(బీపీ మోహన్‌) జూన్ 11న బాధ్యతలు స్వీకరించారు.
Current Affairs
నూతన అధ్యక్షుడి నియామకం వరకు లేదా మూడు నెలలపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. మే 31న తెలుగు వారైన జస్టిస్‌ బీసీవీ ప్రకాశ్‌కుమార్‌ పదవీ విరమణ అనంతరం ఎన్‌సీఎల్‌టీ నాలుగో తాత్కాలిక అధ్యక్షుడిగా మరో తెలుగు వ్యక్తి జస్టిస్‌ బీపీ మోహన్‌ నియమితులయ్యారు.

1962 ఏప్రిల్‌ 15న జన్మించిన జస్టిస్‌ బీపీ మోహన్‌ తన లీగల్‌ ప్రాక్టీసును 1988లో కర్నూలులో ప్రారంభించారు. పలు కార్పొరేటు అంశాలు, సివిల్, రాజ్యాంగ తదితర సబ్జెక్టులపై వాదనలు వినిపించారు. 2009లో ఏపీఐఐసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. జులై 2017లో ఎన్‌సీఎల్‌టీ, ముంబై జ్యుడీషియల్‌ సభ్యుడిగా నియమితులయ్యారు. జూన్‌ 2020లో అమరావతి బెంచ్‌కు బదిలీ అయ్యారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఎన్‌సీఎల్‌టీ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి?
ఎప్పుడు :జూన్ 11
ఎవరు :జస్టిస్‌ భాస్కర పంతుల మోహన్‌(బీపీ మోహన్‌)
ఎక్కడ: న్యూఢిల్లీ
Published date : 12 Jun 2021 06:43PM

Photo Stories