ఎన్‌సీఎల్‌ఏటీ నూతన బెంచ్ ఏ నగరంలో ప్రారంభమైంది?
Sakshi Education
నేషనల్ కంపెనీ అప్పీలేట్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) చెన్నై బెంచ్ జనవరి 25న ప్రారంభమైంది.
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ బ్రాంచీని ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కంపెనీల వివాదాల సత్వర పరిష్కారానికి చెన్నై బెంచ్ తోడ్పడనుంది. జైపూర్, కోల్‌కతా, కొచ్చి, ఇండోర్, అమరావతిలకు ఐదు కొత్త బెంచీలు ప్రకటించడంతో ఎన్‌సీఎల్‌టీ బెంచీల సంఖ్య 16కు చేరింది.
ఏపీఎస్‌బీబీ చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి (ఏపీఎస్‌బీబీ) చైర్మన్‌గా ఏవీ జోసెఫ్ నియమితులయ్యారు. జోసెఫ్ రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్), రాష్ట్ర అటవీ దళాల అధిపతి (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్)గా పనిచేసి రిటైర్ అయ్యారు. అలాగే పీసీసీఎఫ్‌గా రిటైర్ అయిన ఎస్‌కే కౌషిక్‌ను ఏపీఎస్‌బీబీ సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ కంపెనీ అప్పీలేట్ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) చెన్నై బెంచ్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో
ఎందుకు : దక్షిణాది రాష్ట్రాల్లో కంపెనీల వివాదాల సత్వర పరిష్కారానికి

Published date : 28 Jan 2021 05:55PM