Skip to main content

‘ఎన్సీడీసీ’ ఏర్పాటుకు కేంద్రం తుది నిర్ణయం

తెలంగాణలో జాతీయ అంటు వ్యాధుల నియంత్రణ కేంద్రాన్ని (ఎన్సీడీసీ) నెలకొల్పడంపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది.
Current Affairs
ఈ మేరకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయమై తాజాగా రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసినట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఎన్‌సీడీసీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై ఇప్పటికే కేంద్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించారు.

‘ఎన్‌సీడీసీ’ ఏమి చేస్తుందంటే..?
హైదరాబాద్‌లో అంటు వ్యాధుల నియంత్రణ కేంద్రం ఏర్పాటైతే ప్రమాదకరమైన వైరస్‌లపై ఇక్కడే పరిశోధనలు చేయడానికి వీలుంటుంది. కరోనా, స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ ఫ్లూ, జికా, గనేరియా, యాస్, వైరల్‌ హెపటైటిస్, రేబిస్, లెప్టోస్పైరోసిస్‌ వంటి వ్యాధుల నియంత్రణ, నిర్మూలనలో ఎన్‌సీడీసీ కీలకంగా వ్యవహరిస్తుంది. వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు తక్షణమే నిర్ధారణ పరీక్షలు, పరిశోధనలు, సత్వర చర్యలు, అవగాహన, శిక్షణ తదితర కార్యక్రమాల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్‌సీడీసీ ఏర్పాటైతే శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇతర మానవ వనరుల నియామకాలకయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుంది. దాదాపు రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక లేబొరేటరీని నిర్ణయించ‌నున్నారు. దానితో రాష్ట్రంలో అంటువ్యాధులపై నిరంతర పరిశోధనలు కొనసాగే అవకాశం ఉంటుందని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

క్విక్‌ రివ్యూ:
ఏమిటి :
‘ఎన్‌సీడీసీ’ ఏర్పాటు
ఎక్కడ : హైదరాబాద్‌ (తెలంగాణ)
ఎందుకు : ప్రమాదకరమైన వైరస్‌లపై పరిశోధనలు చేయడానికి...
Published date : 16 Mar 2021 05:24PM

Photo Stories