ఎన్‌పీఏల భారం తగ్గుతోంది: నిర్మలా
Sakshi Education
ప్రభుత్వ రంగ బ్యాంకులపై మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గుతోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 10న లోక్‌సభలో తెలిపారు.
2018 మార్చిలో రూ.8.96 లక్షల కోట్లు ఉన్న ఎన్‌పీఏల భారం 2019 సెప్టెంబర్ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. దేశంలో బ్యాంకింగ్ రంగ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని అన్నారు. బ్యాంకింగ్‌లో పాలనా వ్యవస్థ మెరుగుదల, పర్యవేక్షణ, రికవరీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌పీఏల భారం 2019 సెప్టెంబర్ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గింది
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌పీఏల భారం 2019 సెప్టెంబర్ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గింది
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
Published date : 11 Feb 2020 05:32PM