Skip to main content

ఎన్పీఆర్ సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్పీఆర్)ను సవరించేందుకు(అప్‌డేట్) ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ డిసెంబర్ 24న ఆమోదం తెలిపింది.
Current Affairsఎన్పీఆర్ అప్‌డేట్ కోసం రూ. 3,941.35 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య జరిగే ‘జనగణన - 2021’ తొలి దశతో పాటు ఎన్పీఆర్‌ను అప్‌డేట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్పీఆర్ డేటాను సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఉపయోగిస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

ఎన్పీఆర్ విశేషాలు
  • దేశంలోని ‘సాధారణ నివాసుల’ వివరాలను ఎన్పీఆర్‌లో నమోదు చేస్తారు.
  • ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరునెలలు ఒక ప్రాంతంలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ‘సాధారణ నివాసి’గా పరిగణిస్తారు.
  • మొదట 2010లో ఎన్పీఆర్‌ను రూపొందించగా, 2015లో ఇంటింటి సర్వే ద్వారా దీన్ని అప్‌డేట్ చేశారు.
  • 2021 జనాభా గణనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. జనాభా పట్టికను సవరించేందుకు తాజాగా నిర్ణయం జరిగింది. అస్సాం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది.

జనగణనకు రూ. 8,754.23 కోట్లు
దేశ జనాభాను లెక్కించేందుకు ఉద్దేశించిన జనగణన- 2021 కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8,754.23 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించింది.

జనగణన- 2021 విశేషాలు
  • ఇది దేశంలో జరిగే 16వ జనగణన.
  • స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన.
  • ఈ జనగణన దేశమంతటా చేస్తారు.
  • జనగణన రెండు విడతలుగా జరుగనుంది. తొలి దశలో 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు కుటుంబాల గణన, 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు మొత్తం జనాభా గణన ఉంటుంది.
  • ఈ జనగణన కోసం మొబైల్ యాప్‌ను ఉపయోగించనున్నారు.
ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏ, సెన్సస్ ఏమిటీవి? 

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 25 Dec 2019 05:42PM

Photo Stories