Skip to main content

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేత

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మార్చి 10న విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎన్నికల కమిషన్ (ఈసీ) మే 26న ఎత్తివేసింది.
ఈ మేరకు కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ సమాచారం అందించింది. అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకు ఎన్నికల కోడ్‌ను విధిస్తారు. అలాగే ఓటర్లను భయపెట్టి లేదా మతం, లంచం ఆశ చూపి ఓట్లు అడిగే రాజకీయ నాయకులను గుర్తించడానికి ఈసీ ఈ కోడ్‌ను ఉపయోగిస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేత
ఎప్పుడు : మే 26
ఎవరు : ఎన్నికల కమిషన్ (ఈసీ)
Published date : 27 May 2019 05:47PM

Photo Stories