Skip to main content

ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ నియామకం

కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.
Current Affairs

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయన నియామకానికి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆగస్టు 21న ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏషియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) వైస్‌ చైర్మన్ గా నియమితులైన అశోక్‌ లావాసా ఆగస్టు 31 తేదీన ఎన్నికల కమిషనర్‌గా విధుల నుంచి తప్పుకోనున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాజీవ్‌కుమార్‌ అదే రోజు ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సునీల్‌ అరోరా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాగా, సుశీల్‌ చంద్ర ఎన్నికల కమిషన్ లో మరో సభ్యుడు. ఆగష్టు 31న రాజీవ్‌ కుమార్‌ వీరితో చేరుతారు.

చదవండి: ఎన్నికల కమిషనర్‌ లావాసా రాజీనామా

క్విక్ రివ్యూ :
ఏమిటి : నూతన ఎన్నికల కమిషనర్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌

Published date : 24 Aug 2020 07:54PM

Photo Stories