ఎన్నికల కమిషనర్ లావాసా రాజీనామా
Sakshi Education
ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు అశోక్ లావాసా ఆగస్టు 18న రాజీనామా చేశారు.

లావాసాత్వరలోనే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఉపాధ్యక్షునిగా చేరనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతికోవింద్కి రాజీనామా లేఖను పంపించారు.ఆగస్టు 31న తనని బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ఆ లేఖలో కోరారు.ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోన్న ఏడీబీలో 2020, సెప్టెంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఈసీ సునీల్ అరోరా 2021, ఏప్రిల్‌లో రిటైర్ అవనున్నారు. ఆయన తరువాత, ఎన్నికల కమిషన్ లో సీనియర్ సభ్యుడు లావాసాయే. పదవీకాలం ముగియక ముందే, ఎన్నికల కమిషనర్‌గా తప్పుకున్న రెండో వ్యక్తిగా లావాసా నిలిచారు.
చదవండి: ఏడీబీ నూతన వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ లవాసా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్నికల కమిషనర్ బాధ్యతలకు రాజీనామా
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : అశోక్ లావాసా
ఎందుకు :లావాసాత్వరలోనే ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఉపాధ్యక్షునిగాచేరనున్నందున

Published date : 19 Aug 2020 05:09PM