ఎనిమిదేళ్ల నిషేధానికి గురైన శ్రీలంక క్రికెటర్?
Sakshi Education
అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు శ్రీలంక క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగేపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎనిమిదేళ్ల నిషేధం విధించింది.
ఈ విషయాన్ని ఏప్రిల్ 19న వెల్లడించింది. 2017లో యూఏఈలో జరిగిన టి20 టోర్నీలో శ్రీలంకకు చెందిన ఓ జట్టు పాల్గొంది. ఈ టోర్నీ సందర్భంగా దిల్హారా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఐసీసీ విచారణలో తేలింది. 40 ఏళ్ల దిల్హారా 2016లో రిటైరయ్యాడు. శ్రీలంక తరఫున తొమ్మిది వన్డేల్లో, రెండు టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా గొటబయ రాజపక్స, ప్రధానమంత్రిగా మహింద రాజపక్స ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎనిమిదేళ్ల నిషేధానికి గురైన శ్రీలంక క్రికెటర్?
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : దిల్హారా లోకుహెట్టిగే
ఎందుకు : 2017లో యూఏఈలో జరిగిన టి20 టోర్నీ సందర్భంగా.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎనిమిదేళ్ల నిషేధానికి గురైన శ్రీలంక క్రికెటర్?
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : దిల్హారా లోకుహెట్టిగే
ఎందుకు : 2017లో యూఏఈలో జరిగిన టి20 టోర్నీ సందర్భంగా.. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందకు
Published date : 20 Apr 2021 06:16PM