ఎన్‌హెచ్‌ఎస్‌లో వలంటీర్‌గా హెథర్ నైట్
Sakshi Education
ప్రపంచాన్ని విలవిల్లాడిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటే ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హెథర్ నైట్ మరో అడుగు ముందుకు వేసి సేవ మార్గాన్ని ఎంచుకుంది.
తమ దేశ ‘జాతీయ ఆరోగ్య సేవా సంస్థ’ (ఎన్‌హెచ్‌ఎస్)లో వలంటీర్‌గా సేవలందించేందుకు తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నట్లు మార్చి 29న ఆమె తెలిపింది. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో ప్రాణాంతక వైరస్‌ను అరికట్టేందుకు నిరంతం శ్రమిస్తోన్న వైద్య వ్యవస్థకు తన సహాయాన్ని అందించనున్నట్లు 29 ఏళ్ల హెథర్ నైట్ పేర్కొంది. ఇందులో భాగంగా ఆమె చికిత్సకు అవసరమైన మందుల రవాణా చేయడంతోపాటు కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించనుంది.
Published date : 30 Mar 2020 06:50PM