Skip to main content

ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది నియమితులయ్యారు.
Current Affairsమునుపటి చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా తరువాత ఈ ఏడాది జనవరి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే కాగా, డిసెంబర్ 6న చతుర్వేది చైర్మన్ బాధ్యతలను స్వీకరించారని ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇందుకు సెబీ అనుమతి లభించినట్లు ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శిగా సేవలందించిన ఈయన నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు ఎక్స్ఛేంజ్ బోర్డ్ వెల్లడించింది.

క్విక్ రివ్వూ:
ఏమిటి:
ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది
ఎవరు: గిరీష్ చంద్ర
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: న్యూఢిల్లీ
Published date : 07 Dec 2019 05:20PM

Photo Stories