ఎన్‌ఆర్‌సీ నుంచి లక్ష పేర్లు తీసివేత
Sakshi Education
అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ముసాయిదా నుంచి మరో 1,02,462 మందిని పేర్లను జూన్ 26న తొలగించారు.
వివిధ కారణాల చేత వారందరూ భారత పౌరసత్వం పొందేందుకు అనర్హులని ఈ మేరకు ఎన్‌ఆర్‌సీ నుంచి వారిని తొలగించినట్లు ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ప్రకటించారు. ఎన్‌ఆర్‌సీలో తమ పేర్లను చేర్చాలంటూ అస్సాంలో మొత్తం 3.29 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా, గతంలోనే 40 లక్షల మందిని అనర్హులుగా గుర్తించి వారి పేర్లను ఎన్‌ఆర్‌సీ ముసాయిదా నుంచి తొలగించారు. తాజాగా మరో లక్ష మంది పేర్లను తొలగించారు. జూలై 21న ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల కానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఆర్‌సీ నుంచి లక్ష పేర్లు తీసివేత
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కో-ఆర్డినేటర్
ఎక్కడ : అస్సాం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఆర్‌సీ నుంచి లక్ష పేర్లు తీసివేత
ఎప్పుడు : జూన్ 26
ఎవరు : ఎన్‌ఆర్‌సీ రాష్ట్ర కో-ఆర్డినేటర్
ఎక్కడ : అస్సాం
Published date : 27 Jun 2019 05:48PM