ఎన్‌ఐసీ కంప్యూటర్లపై మాల్‌వేర్ దాడి
Sakshi Education
కీలక కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ)కు చెందిన దాదాపు 100 కంప్యూటర్లపై మాల్‌వేర్ దాడి జరిగింది.
దీనికి సంబంధించి, ఎన్‌ఐసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ‘ఎన్‌ఐసీ ఉద్యోగి ఒకరికి, తన అధికారిక మెయిల్ ఐడీకి ఒక ఈమెయిల్ వచ్చింది. అందులోని లింక్‌పై క్లిక్ చేయడంతో ఆ ఉద్యోగి కంప్యూటర్‌లోకి మాల్‌వేర్ చొరబడింది’ అని సెప్టెంబర్ 18న పోలీసు అధికారులు వెల్లడించారు. బెంగళూరులోని ఒక సంస్థ నుంచి ఆ మాల్‌వేర్ ఈ మెయిల్ వచ్చినట్లుగా గుర్తించారు.
సున్నితమైన సమాచారం...
- ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, దేశ పౌరులు, దేశ భద్రతలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం ఎన్‌ఐసీ కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుంది.
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఎన్‌ఐసీ ప్రధాన విధుల్లో... ప్రభుత్వానికి సంబంధించి సైబర్ రంగంలో మౌలిక వసతుల కల్పన ఒకటి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఈ విభాగం ఈ -గవర్నెన్స్ లో నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది.
Published date : 19 Sep 2020 04:55PM