ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త గోపాలన్ కన్నుమూత
Sakshi Education
జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) మాజీ సీనియర్ శాస్త్రవేత్త, లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ కొలుతూర్ గోపాలన్ (101) కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో అక్టోబర్ 3న తుదిశ్వాస విడిచారు. 1918లో జన్మించిన గోపాలన్ ఉన్నత విద్య పూర్తి చేశాక ఎన్‌ఐఎన్‌లో శాస్త్రవేత్తగా చేరి 1961 నుంచి 1974 వరకు సేవలందించారు. 1974 నుంచి 1979 వరకు ఢిల్లీలోని ఇండియన్ కౌన్సి ల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డెరైక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. పోషకాహారంపై ఆయన సాగించిన పరిశోధనలకు 1970లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్ అందుకున్నారు. పదవీ విరమణ తర్వాత న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్థాపించి సేవలు అందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఐఎన్ మాజీ సీనియర్ శాస్త్రవేత్త కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : డాక్టర్ కొలుతూర్ గోపాలన్ (101)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అనారోగ్యం కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఐఎన్ మాజీ సీనియర్ శాస్త్రవేత్త కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : డాక్టర్ కొలుతూర్ గోపాలన్ (101)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 04 Oct 2019 05:36PM