Skip to main content

ఎంపీసీ ద్వైమాసిక సమావేశం ప్రారంభం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం ఆగస్టు 5న ప్రారంభమైంది.
మూడు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన ప్రారంభమైన ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆగస్టు 7వ తేదీన ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడనుంది.

బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే- రెపో. ప్రస్తుతం రెపో రేటు 5.75 శాతంగా ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
Published date : 06 Aug 2019 05:32PM

Photo Stories