ఎంపీ సంతోష్‌కుమార్‌కు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం
Sakshi Education
గ్రీన్ చాలెంజ్ ద్వారా పచ్చదనం పెంపు కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించింది.
మహాత్మా గాంధీ 150వ జన్మదినం సందర్భంగా గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ (జీ కాట్) ప్రతినిధులు ఈ అవార్డును అక్టోబర్ 1న సంతోష్‌కుమార్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హరితహారంలో భాగంగా చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌కు దేశ, విదేశాల నుంచి మద్దతు లభించిందని ఎంపీ సంతోష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ అవార్డును సీఎం కేసీఆర్‌కు అంకితం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న బాహుబలి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎంపీ సంతోష్‌కుమార్‌కు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ (జీ కాట్)
ఎందుకు : గ్రీన్ చాలెంజ్ ద్వారా పచ్చదనం పెంపు కోసం కృషి చేస్తున్నందున
Published date : 02 Oct 2020 05:20PM