ఏఎస్‌బీ క్లాసిక్ ఓపెన్ చాంపియన్‌గా సెరెనా
Sakshi Education
ఏఎస్‌బీ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో సింగిల్స్ చాంపియన్‌గా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నిలిచింది.
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జనవరి 12న ముగిసిన ఈ టోర్ని ఫైనల్లో సెరెనా 6-3, 6-4తో జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన 38 ఏళ్ల సెరెనాకు 43 వేల డాలర్లు ప్రైజ్‌మనీ (రూ. 30 లక్షల 52 వేలు) లభించింది. ఈ మొత్తాన్ని ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల సహాయార్ధం ఏర్పాటు చేసిన బుష్‌ఫైర్ రిలీఫ్ ఫండ్‌కు సెరెనా విరాళంగా ఇచ్చేసింది.
73వ సింగిల్స్ టైటిల్
సెరెనా కెరీర్‌లో ఇది 73వ సింగిల్స్ టైటిల్. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాక సెరెనా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే. ఎనిమిది వారాల గర్భవతిగానే 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొని చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఆ తర్వాత ఆటకు విరామం ఇచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఎస్‌బీ క్లాసిక్ ఓపెన్ టోర్నీలో సింగిల్స్ విజేత
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : సెరెనా విలియమ్స్
ఎక్కడ : ఆక్లాండ్, న్యూజిలాండ్
మాదిరి ప్రశ్నలు

1. క్రింది వారిలో 2019 ఏడాదికి గాను అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నను ఎవరు అందుకున్నారు?
1. దీపా మాలిక్
2. రవీంద్ర జడేజా
3. బజరంగ్ పూనియా
4. మొహమ్మద్ అనస్
- View Answer
- సమాధానం : 1, 3
2. 2019 ఏడాదికి గాను అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నను అందుకున్న బజరంగ్ పూనియా ఏ క్రీడకు చెందినవాడు?
1. క్రికెట్
2. హాకీ
3. కబడ్డీ
4. రెజ్లింగ్
- View Answer
- సమాధానం : 4
Published date : 13 Jan 2020 05:45PM