Skip to main content

ఏఎన్‌యూ పరిశోధకురాలికి జాతీయ స్థాయి అవార్డు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్‌‌ట్స కళాశాల సోషియాలజీ అండ్ సోషల్‌వర్క్ విభాగ పరిశోధకురాలు ఎం.స్వర్ణలతకు భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డు లభించింది.
న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ (జీఈపీఆర్‌ఏ) సంస్థ ఇటీవల బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ప్రణాళికా శాఖ మాజీ మంత్రి రాజశేఖరన్ చేతులమీదుగా స్వర్ణలత ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణలతను ఏఎన్‌యూ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ కె.రామ్‌జీ అభినందించారు. రానున్న రోజుల్లో పరిశోధనారంగంలో మంచి ప్రతిభ కనబరిచి మరిన్ని అవార్డులు సాధించాలని సూచించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :ఎం.స్వర్ణలతకు భారతరత్న ఇందిరాగాంధీ జాతీయ అవార్డు
ఎవరు : ఎం.స్వర్ణలత
ఎక్కడ : బెంగళూరులో
Published date : 14 Mar 2019 07:52PM

Photo Stories