Skip to main content

ఏఎన్ 32 విమానంశకలాల గుర్తింపు

ఇటీవల గల్లంతైన వాయుసేన ఏఎన్-32 విమానం శకలాలను 8 రోజుల తర్వాత జూన్ 11న అరుణాచల్ ప్రదేశ్‌లోని లిపోకు సమీపంలో గుర్తించారు.
లిపోకు ఉత్తరాన, టాటోకు ఈశాన్యంగా 16 కిలోమీటర్ల దూరంలో 12 వేల అడుగుల ఎత్తయిన ప్రాంతంలో భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17తో జరిపిన గాలింపులో ఏఎన్-32 శకలాలు కన్పించాయని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో ఉన్న 13 మంది ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. జూన్ 3వ తేదీన అస్సాంలోని జోర్‌హట్ నుంచి చైనా సరిహద్దు సమీపంలోని మెచూకా బయలుదేరిన ఈ విమానం తర్వాత రాడార్ నుంచి అదృశ్యమైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏఎన్ 32 విమానం శకలాల గుర్తింపు
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : భారత వాయుసేన
ఎక్కడ : లిపో, అరుణాచల్ ప్రదేశ్
Published date : 12 Jun 2019 06:16PM

Photo Stories