Skip to main content

ఏఏఐ అధ్యక్షుడిగా అర్జున్ ముండా

భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అధ్యక్షుడిగా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా ఎన్నికయ్యారు.
Current Affairsజనవరి 18న జరిగిన ఎన్నికల్లో ఆయన 34-18తో మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు బీవీ పాపారావుపై గెలుపొందారు. అలాగే సెక్రటరీ జనరల్‌గా ప్రమోద్ చుండూర్కర్ (మహారాష్ట్ర), కోశాధికారిగా రాజేంద్ర సింగ్ తోమర్ (ఉత్తరాఖండ్) ఎన్నికయ్యారు. వీరు ఈ పదవుల్లో నాలుగేళ్ల పాటు కొనసాగనున్నారు. అర్జున్ ముండా గతంలో మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అధ్యక్షుడిగా ఎన్నిక
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా

మాదిరి ప్రశ్నలు
Published date : 20 Jan 2020 05:54PM

Photo Stories