Skip to main content

ఏఆర్‌ఐఐఏ ర్యాంకుల్లో మద్రాస్‌ ఐఐటీకు తొలి స్థానం

సృజనాత్మక, నూతన ఆవిష్కరణల ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు కేంద్రప్రభుత్వం అటల్‌ ర్యాంకింగ్‌ ఆఫ్‌ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ ఎచీవ్‌మెంట్స్‌ (ఏఆర్‌ఐఐఏ) ద్వారా ర్యాంకులను ప్రకటిస్తోంది.
Current Affairs
2020 ఏడాదిగాను ఆరు కేటగిరీల్లోని ఈ ర్యాంకులను ఆగస్టు 18న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు విడుదల చేశారు.

మొదటి కేటగిరీలో...
ఏఆర్‌ఐఐఏ మొదటి కేటగిరీలో మద్రాస్ ఐఐటీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో ముంబై ఐఐటీ, మూడో స్థానంలో ఢిల్లీ ఐఐటీ, నాలుగో స్థానంలో బెంగళూరు ఐఐటీ, ఐదో స్థానంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిలిచాయి. కాన్పూర్, మండీ, రూర్కీలతో సహా 7 ఐఐటీలు, మొదటి పది స్థానాల్లో ఉన్నాయి.

రాష్ట్ర నిధుల కేటగిరిలో...
రాష్ట్ర నిధులతో నడిచే విశ్వవిద్యాలయాల కేటగిరీలో మహారాష్ట్రలోని ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ మొదటి స్థానంలో, రెండు, మూడు స్థానాల్లో పంజాబ్‌ యూనివర్సిటీ, ఛౌదరి చరణ్‌ సింగ్‌ హరియాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నాయి.

స్వయం ప్రతిపత్తి సంస్థల కేటగిరీలో…
రాష్ట్ర నిధులతో నడిచే స్వయం ప్రతిపత్తి సంస్థల కేటగిరీలో పుణేలోని ‘కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌’, పీఈఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(బెంగళూరు), కోయంబత్తూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ప్రైవేటు వర్సిటీల్లో ‘ది కళింగ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ మొదటి స్థానంలో ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఆర్‌ఐఐఏ ర్యాంకుల్లోమొదటి కేటగిరీలో తొలి స్థానం
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : మద్రాస్‌ ఐఐటీ
Published date : 19 Aug 2020 05:05PM

Photo Stories