Skip to main content

ఏ వర్సిటీ క్యాంపస్‌లో వివేకానంద విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు?

భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని నవంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు.
Current Affairs
అనంతరం మోదీ మాట్లాడుతూ... స్వామి వివేకానంద కలలు కన్న దృఢమైన, సౌభాగ్యమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ విగ్రహం స్ఫూర్తినిస్తుందన్నారు. 21వ శతాబ్దం భారత్‌దేనని 20వ శతాబ్దం ప్రారంభంలోనే స్వామి వివేకానంద చెప్పారని గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కన్నా సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హాని చేస్తుందని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జేఎన్‌యూ క్యాంపస్, న్యూఢిల్లీ
Published date : 13 Nov 2020 05:55PM

Photo Stories