Skip to main content

ఏ విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు?

మైసూర్ విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 19న వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.
Current Affairsప్రస్తుత దశాబ్దాన్ని భారతదేశ దశాబ్దంగా మార్చడం, దేశ పురోభివృద్ధే లక్ష్యంగా అన్ని రంగాల్లో అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ప్రధాని పేర్కొన్నారు. ఉన్నత విద్యకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి, మన యువతలో పోటీతత్వాన్ని పెంచడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

గ్రాండ్ చాలెంజెస్ లక్ష్యం...
ప్రభుత్వ విధాన నిర్ణేతలు, పరిశోధకులను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చి పరిష్కార మార్గాలు కనిపెట్టడమే లక్ష్యంగా అక్టోబర్ 19న జరిగిన ‘గ్రాండ్ చాలెంజెస్’ వార్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే దేశాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. దాదాపు 40 దేశాలకు చెందిన 1,600 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాలు గత 15 సంవత్సరాలుగా జరుగుతున్నాయి.
Published date : 20 Oct 2020 05:35PM

Photo Stories