ఏ తేదీని జాతీయ జావెలిన్ డేగా నిర్వహిస్తామని ఏఎఫ్‌ఐ ప్రకటించింది?
Sakshi Education
టోక్యో ఒలింపిక్స్–2020లో భాగంగా 2021, ఆగస్టు 7న జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచిన స్వర్ణ పతకం సాధించాడు.
దీంతో విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 7వ తేదీని ‘జాతీయ జావెలిన్ డే’గా నిర్వహిస్తామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఆగస్టు 10న ప్రకటించింది. ఈ విషయమై ఏఎఫ్‌ఐ ప్రణాళిక సంఘం చైర్మన్ లలిత్ భానోత్ మాట్లాడుతూ... ‘‘ జావెలిన్ త్రోకు ప్రాచుర్యం తెచ్చేందుకు, ఈ క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు ఇకపై ఆగస్టు 7వ తేదీని జాతీయ జావెలిన్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇందులో భాగంగా యేటా ఆ రోజు రాష్ట్ర సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తాం. వేడుకగా బహుమతుల ప్రదానోత్సవం జరుపుతాం’ అని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆగస్టు 7వ తేదీని జాతీయ జావెలిన్ డే’గా నిర్వహిస్తాం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ)
ఎందుకు : టోక్యో ఒలింపిక్స్–2020లో భాగంగా 2021, ఆగస్టు 7న జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచిన స్వర్ణ పతకం సాధించిన నేపథ్యంలో...

Published date : 11 Aug 2021 06:12PM