ఏ సంస్థ నుంచి నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను వేరు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది?
Sakshi Education
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లకు రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అక్టోబర్ 14న సమావేశమైన మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు లబ్ధి చేకూరేలా చేయడమే కేంద్రం లక్ష్యమని మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.
నాగర్నార్ స్టీల్‌ప్లాంట్ డీమెర్జర్‌కు ఆమోదం
నిర్మాణంలో ఉన్న నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎండీసీ నుంచి వేరు చేయడానికి (డీమెర్జర్) కేబినేట్ ఆమోదం తెలిపింది. డీమెర్జర్ అనంతరం ప్రభుత్వానికి ఉన్న పూర్తి వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుకు విక్రయించనుంది.
చత్తీస్‌గఢ్‌లో..
కేంద్ర ఉక్కు శాఖ పరిధిలో ఉన్న ఎన్‌ఎండీసీ చత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్‌లో రూ.23,140 కోట్ల అంచనాతో నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు రూ.17,186 కోట్లను ఇన్వెస్ట్ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఎండీసీ డీమెర్జర్‌కు ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర మంత్రి మండలి
ఎందుకు : నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను ఎన్‌ఎండీసీ నుంచి వేరు చేసేందుకు

Published date : 15 Oct 2020 05:07PM